News January 15, 2025
కనుమ రోజున రథం ముగ్గు.. ఎందుకంటే?

కనుమ రోజున తెలుగు లోగిళ్లలో రథం ముగ్గు వేయడం ఆచారంగా ఉంది. దీని వెనుక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమనే రథాన్ని నడిపేది దైవమని భావిస్తారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ రకంగా ప్రార్థిస్తారు. పాతాళం నుంచి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని ఓ కథ. అయితే ఈ ముగ్గులు వీధిలోని ఇళ్లను కలుపుతూ వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తోంది.
Similar News
News December 20, 2025
గుడ్లు తింటే క్యాన్సర్ రాదు: FSSAI

గుడ్లను తింటే క్యాన్సర్ వస్తుందని <<18572969>>జరుగుతున్న<<>> ప్రచారాన్ని FSSAI ఖండించింది. కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో ప్రమాదకర నైట్రోఫ్యూరాన్లు, యాంటీబయాటిక్‌లపై నిషేధం కొనసాగుతోందని తెలిపింది. ‘గరిష్ఠంగా KGకి 1.0 మైక్రోగ్రామ్ నైట్రోఫ్యూరాన్లు ఉండొచ్చు. వీటివల్ల ప్రమాదం లేదు. ఫుడ్ సేఫ్టీ వయలేషన్‌గా పరిగణించలేం. నైట్రోఫ్యూరాన్లకు క్యాన్సర్‌కు సంబంధం లేదు. మన దేశంలో గుడ్లు సురక్షితం’ అని స్పష్టం చేసింది.
News December 20, 2025
APPLY NOW: APEDAలో ఉద్యోగాలు

<
News December 20, 2025
ఏపీ స్ఫూర్తితో తెలంగాణలో అధికారం చేపడతాం: బండి సంజయ్

కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మోదీ-అటల్ సుపరిపాలన యాత్రలో భాగంగా విశాఖలో వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పోరాటాల గడ్డ వైజాగ్‌కు వచ్చిన ప్రతిసారీ ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అమల్లో ఉంది. ఇక్కడి పరిస్థితులను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో అధికారంలోకి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.


