News September 22, 2025

అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలంటే?

image

Sept 22 – పరమన్నం/రైస్ ఖీర్
Sept 23 – కొబ్బరి అన్నం, అల్లపు గారెలు
Sept 24 – మినప వడలు/పులిహోర
Sept 25 – పాయసం, రవ్వ కేసరి
Sept 26 – పూర్ణాలు, రవ్వ కేసరి
Sept 27 – రవ్వ కేసరి/పాయసన్నం
Sept 28 – కట్టు పొంగలి, Sept 29 – పాయసం, శాఖన్నం
Sept 30 – కదంబం/కలగలుపు కూర
Oct 1 – చక్కెర పొంగలి, Oct 2 – దద్దోజనం, మహా నివేదన

Similar News

News January 31, 2026

అమెరికాలో మళ్లీ షట్‌డౌన్.. డీల్ కుదిరినా తప్పని తిప్పలు!

image

అమెరికా ప్రభుత్వం మళ్లీ పాక్షికంగా మూతపడింది. నిధుల కేటాయింపుపై సెనేట్ చివరి నిమిషంలో డీల్ కుదుర్చుకున్నా.. ప్రతినిధుల సభ సెలవులో ఉండటంతో అర్ధరాత్రి నుంచి పాక్షిక షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందడంతో ఇమిగ్రేషన్ నిధులపై డెమోక్రాట్లు అభ్యంతరం తెలిపారు. సెప్టెంబర్ వరకు నిధులు ఇచ్చేలా ట్రంప్ ఒప్పందం చేసుకున్నా టెక్నికల్ ఇష్యూస్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయాయి.

News January 31, 2026

Dy.CMగా సునేత్ర.. నాకేం తెలియదన్న శరద్ పవార్!

image

దివంగత నేత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్ MH Dy.CMగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని NCP(SP) అధినేత శరద్ పవార్ అన్నారు. ఆ నిర్ణయంతో తనకు సంబంధం లేదని చెప్పారు. అజిత్ పవార్ ఆశయం మేరకు NCP రెండు వర్గాలు ఏకమవ్వాలని చర్చలు జరిగాయని, కానీ ఆయన అకాల మరణం తీరని లోటని పేర్కొన్నారు. విలీనం ఖాయమనుకున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News January 31, 2026

బంగారం, వెండి ధరలు తగ్గడానికి ఈయనే కారణం!

image

బంగారం, వెండి ధరలు కుదేలవ్వడానికి ప్రధాన కారణం కెవిన్ వార్ష్. ఈయన US సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌ తదుపరి ఛైర్మన్‌ కానున్నారు. ట్రంప్ ఆయనను నామినేట్ చేయడంతో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేసిన వార్స్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉంటారు. డాలర్ బలోపేతానికే పెద్దపీట వేస్తారన్న అంచనాలు ఇన్వెస్టర్లను భయంలోకి నెట్టాయి. భారీగా అమ్మకాలు చేపట్టడంతో ధరలు కుప్పకూలాయి.