News March 5, 2025
ఒకప్పుడు నటిగా ఫెయిల్… ఇప్పుడు గూగుల్ ఇండియా మేనేజర్

ఆ అమ్మాయి ఒకప్పుడు మహేశ్ బాబుతో నటించారు. పలు సీరియల్స్‌లోనూ తన లక్ పరీక్షించుకుంది. సక్సెస్ కాకపోవటంతో వేరే రంగాన్నిఎంచుకొని ఇప్పుడు పలువురికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. మయూరి కాంగో నటిగా స్థిరపడాలనుకున్నారు. సెట్ కాకపోవటంతో పెళ్లిచేసుకొని విదేశాలకు వెళ్లారు. న్యూయార్క్‌లో ఎంబీఏ చేసి పలు కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం ఏకంగా గూగుల్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
Similar News
News March 5, 2025
విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దేందుకు ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిడమర్రు (మంగళగిరి) స్కూల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడిస్తారు. ఏ విద్యార్థికి ఏ క్రీడల్లో ఆసక్తి ఉందో అందులో శిక్షణ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా మార్చడమే లక్ష్యమన్నాయి.
News March 5, 2025
400 ఎకరాలు.. రూ.30వేల కోట్లు

TG: HYD కంచి గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ.30వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు లేఅవుట్ల అభివృద్ధికి కన్సల్టెంట్ల నుంచి TGIIC ప్రతిపాదనలు కోరింది. ఎల్లుండి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003 శాతం సదరు సంస్థకు వాటాగా ఇవ్వనుంది.
News March 5, 2025
IPL-2025లో కొత్త రూల్స్

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న IPL సీజన్లో BCCI కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ప్లేయర్లు, స్టాఫ్ కుటుంబసభ్యులను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్లేయర్లు మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లకు జట్టు బస్సులోనే ప్రయాణించాలని పేర్కొంది. అవార్డు ప్రదాన కార్యక్రమంలో స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించొద్దని తెలిపింది. రూల్స్ ఉల్లంఘిస్తే తొలుత వార్నింగ్, తర్వాత ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.