News June 26, 2024
మరోసారి $100 బిలియన్లు పంపారు!

విదేశాల్లోని భారతీయులు తమ కుటుంబీకులు/బంధువుల కోసం వరుసగా రెండో ఏడాది $100 బిలియన్లకుపైగా మొత్తాన్ని పంపారు. FY24లో వీరు $107 బిలియన్లు పంపించారు. ఇది విదేశీ పెట్టుబడుల నికర విలువ ($54 బిలియన్) కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. 2023లో అమెరికా నుంచే ఎక్కువగా భారత్‌కు ($125 బిలియన్లు) నిధులు వచ్చాయి. US నుంచి డబ్బు అందుకున్న దేశాల్లో భారత్ తర్వాతి స్థానాల్లో మెక్సికో ($67B), చైనా ($50B) ఉన్నాయి.
Similar News
News October 26, 2025
స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 55 పోస్టులు

ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ 55 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 26, 2025
18 మృతదేహాలు అప్పగింత

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో 19మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరిలో 18 మృతదేహాలను DNA పరీక్షల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఓ గుర్తుతెలియని మృతదేహం కోసం చిత్తూరు(D) నుంచి ఒకరు వచ్చారని SP విక్రాంత్ తెలిపారు. తన తండ్రి కనిపించడంలేదని ఆ వ్యక్తి చెప్పినట్లు వివరించారు. DNA ఆధారంగా ఆ డెడ్‌బాడీ ఎవరిదన్నది తేలుతుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని పేర్కొన్నారు.
News October 26, 2025
టాస్ గెలిచిన భారత్

WWC: లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్‌లో BANతో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన IND బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యమవనుంది.
IND: ప్రతీకా, స్మృతి, హర్లీన్, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్(C), దీప్తి, ఉమా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా
BAN: సుమియా, రుబ్యా హైదర్, షర్మిన్, శోభన, సుల్తానా(C), షోర్నా, మోని, రబేయా, నహిదా, నిషితా, మరుఫా


