News September 11, 2024

అమరావతిలో ఫ్లాట్ల నిర్మాణానికి మరోసారి టెండర్లు

image

AP: సీఎం చంద్రబాబు ఆమోదంతో ‘హ్యాపీనెస్ట్’కు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. రూ.930 కోట్ల అంచనా వ్యయంతో రాజధాని అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొత్తం 12 టవర్లలో జీ+18 ఫార్మాట్‌లో 1,200 ఫ్లాట్లు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 2018లోనే అమ్మకాలు పూర్తయినా వైసీపీ హయాంలో పనులు ఆగిపోయాయి. దీంతో మరోసారి టెండర్లు పిలవనుంది.

Similar News

News January 6, 2026

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

image

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.

News January 6, 2026

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని పట్టించే హెల్మెట్!

image

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించే AI హెల్మెట్‌ను బెంగళూరుకు చెందిన ఓ టెకీ తయారు చేశారు. హెల్మెట్‌కు కెమెరాను అమర్చి దానికి AIని జోడించారు. రోడ్డుపై ఎవరైనా హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో వెళ్తే ఇది గుర్తించి ఫొటో తీస్తుంది. లొకేషన్, బండి నంబర్‌తో సహా ఆ ఫొటోలను పోలీసులకు పంపి ఛలాన్ వేసేలా చేస్తుంది. టెక్నాలజీ సాయంతో రోడ్డు భద్రతను పెంచే ఇలాంటి ఐడియాలు అవసరమని పోలీసులు అతడిని ప్రశంసించారు.

News January 6, 2026

ఏడిస్తే ముక్కు ఎందుకు కారుతుందో తెలుసా?

image

మానవ శరీర వ్యవస్థ ఒక ఇంజినీరింగ్ అద్భుతం. మన కంటి మూలలో సూది మొనంత ఉండే ‘లాక్రిమల్ పంక్టం’ అనే రంధ్రం ఒక అదృశ్య డ్రైనేజీ పైపులా పనిచేస్తుంది. కళ్లలో ఊరే అదనపు కన్నీళ్లను ఇది ముక్కులోకి పంపిస్తుంది. అందుకే మనం ఏడ్చినప్పుడు ముక్కు కూడా కారుతుంది. ఈ చిన్న రంధ్రం కంటి తేమను కాపాడుతూ చూపును స్పష్టంగా ఉంచుతుంది. అంటే మనం ఏడుస్తున్నప్పుడు ముక్కు నుంచి కారేది ‘కన్నీళ్లే’. share it