News September 16, 2024
మరోసారి కాల్పుల కలకలం.. ట్రంప్ సురక్షితం

US మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో ఆయన గోల్ఫ్ ఆడుతుండగా కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీసెస్ ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించింది. తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 2 నెలల కిందట సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News January 31, 2026
నాకు ఇచ్చిన నోటీసు అక్రమం.. KCR లేఖ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ACPకి కేసీఆర్ 6 పేజీల లేఖ రాశారు. ‘నాకు ఇచ్చిన నోటీసు అక్రమం. దాని ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారు. ఇంటి గోడకు నోటీసు అంటించడం చట్టవిరుద్ధం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నా. అక్కడే స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. చట్టపరమైన అభ్యంతరాలున్నా రేపు 3PMకు నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరవుతా’ అని లేఖలో పేర్కొన్నారు.
News January 31, 2026
రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేశారు: జగన్

AP: విశాఖలో చంద్రబాబు, ఆయన కుటుంబం దాదాపు రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూములను ఎంపీ భరత్‌కు కట్టబెట్టేశారని ట్వీట్ చేశారు. లోకేశ్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా తోడల్లుడికి కేటాయించేలా చేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లతో GVMC సభ్యులను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారని పేర్కొన్నారు.
News January 31, 2026
ఈ అలవాట్లతో గుండె ఆరోగ్యానికి రిస్క్!

చిన్న పొరపాట్లు గుండె ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడతాయని వైద్యులు చెబుతున్నారు. తినే ఆహారం, నిద్రపోయే సమయం, డైలీ రొటీన్ పనులు హార్ట్ హెల్త్‌ను ప్రభావితం చేస్తాయి. రోజూ 6-8 గం. పాటు నాణ్యమైన నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. కుర్చీ, సోఫా, డ్రైవింగ్ సీట్‌లో పగటిపూట ఎక్కువ సమయం కూర్చొనే వారికి హార్ట్ రిలేటెడ్ సమస్యలు వచ్చే ఛాన్సుంది. ఒత్తిడి, టెన్షన్ శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.


