News November 8, 2024
మరోసారి తండ్రయిన స్టార్ క్రికెటర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ మరోసారి తండ్రయ్యారు. అతని భార్య జెస్సికా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇతనికి హారిసన్ జార్జ్ అని పేరు పెట్టారు. భార్య, కూతురు, కొడుకుతో హెడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరికి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. IPLలో ట్రావిస్ SRHకు ఆడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్లో అదరగొట్టిన ఇతడిని ఆ జట్టు మరోసారి రిటైన్ చేసుకుంది.
Similar News
News October 24, 2025
మ్యాచ్ రద్దు.. WCలో పాక్కు ఘోర అవమానం

ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇవాళ పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాక్ బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే భారీ వర్షం పడగా అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. అంతకుముందే ఇరు జట్లు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తం 7 మ్యాచ్ల్లో పాక్ ఒక్కటీ గెలవలేదు. 4 మ్యాచ్ల్లో ఓడిపోగా 3 రద్దయ్యాయి. దీంతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.
News October 24, 2025
చిన్న కాంట్రాక్టర్లకు తీపి కబురు

TG: ఆర్అండ్బీ చిన్న కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు అందించారు. సీఎం రేవంత్తో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్కు కృషి చేసినట్లు వివరించారు. మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేసిన సీఎం, మంత్రికి రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.
News October 24, 2025
మళ్లీ అదే సిడ్నీ.. కోహ్లీ రేపు ఏం చేస్తారో?

రేపు ఆస్ట్రేలియాతో 3వ వన్డే జరిగే సిడ్నీ వేదిక విరాట్ కోహ్లీ అభిమానులను కలవరపెడుతోంది. 10 నెలల క్రితం ఆయన ఇదే స్టేడియంలో చివరి టెస్ట్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా అనేదే ఫ్యాన్స్ ఆందోళన. తొలి 2 మ్యాచుల్లో డకౌట్, 2వ వన్డేలో అభిమానులకు కోహ్లీ <<18081069>>అభివాదం<<>> చేయడం మరింత కలవరపెడుతున్నాయి. దీంతో రేపు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మీరేమంటారు?


