News March 21, 2024
మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది: సజ్జల
AP: అధికారంలోకి వచ్చేందుకు అప్పటికప్పుడు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పార్టీని మాఫియా ముఠాలా తయారు చేశారని దుయ్యబట్టారు. విజయవాడలో ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. బాబు దోపిడీలు, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు. మరోసారి రాక్షసుల ముఠా ఏకమైందని టీడీపీ కూటమిపై విమర్శలు చేశారు.
Similar News
News November 25, 2024
MHలో బిహార్ ఫార్ములా అమలు చేయండి: శివసేన
మహారాష్ట్రలో బిహార్ ఫార్ములా అమలు చేసి ఏక్‌నాథ్ శిండేను CMగా కొనసాగించాలని శివసేన కోరుతోంది. బిహార్‌లో RJDతో JDU విడిపోయినప్పుడు నితీశ్ కుమార్‌ను CMగా BJP కొనసాగించింది. 2020 బిహార్ ఎన్నికల్లో BJP 74 సీట్లు సాధించింది. JDUకి 43 సీట్లే దక్కినా అనంతర పరిణామాల్లో నితీశ్‌ను CMగా కొనసాగించింది. అదే మాదిరి MHలో BJP 132 స్థానాల్లో గెలిచినా శిండేకే CMగా అవకాశమివ్వాలని శివసేన కోరుతోంది.
News November 25, 2024
మైక్రోసాఫ్ట్‌లోఉండే ఈ వాల్‌పేపర్ ఖరీదెంతంటే?
కంప్యూటర్‌లో వినియోగించే మైక్రోసాఫ్ట్, విండోస్ XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో కనిపించే వాల్‌పేపర్ ఫొటో తీసిందెవరో తెలుసా? అమెరికన్ ఫొటోగ్రాఫర్ చార్లెస్ ఓరీర్. 1996లో ఆయన తీసిన ‘The Bliss’ ఫొటో ఎంతోమందికి తెలియకుండానే ఫేవరెట్‌గా నిలిచింది. దీనికోసం మైక్రోసాఫ్ట్ ఆయనకు $100,000కి పైగా ఇచ్చినట్లు ‘Ladbible’ తెలిపింది. అలాగే పీటర్ బురియన్ తీసిన ‘Autumn wallpaper’ను మైక్రోసాఫ్ట్ XP $45కే కొనుగోలు చేసింది.
News November 25, 2024
బంగాళాఖాతంలో వాయుగుండం
AP: ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు APSDMA వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి ట్రింకోమలికి 600KM, నాగపట్నానికి 880KM, పుదుచ్చేరికి 980KM, చెన్నైకి 1,050KM దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఇది రెండు రోజుల్లో వాయవ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది.