News April 11, 2024

ఒకప్పుడు భారతీయ సంస్కృతి అంటే సిగ్గుపడేవాడిని: దేవ్ పటేల్

image

స్థానిక ప్రభావంతో లండన్‌లో స్కూల్‌కు వెళ్లే రోజుల్లో తన భారత మూలాలు, సంస్కృతుల గురించి సిగ్గుపడేవాడినని బ్రిటిష్ నటుడు దేవ్ పటేల్ తెలిపారు. కానీ స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక డైరెక్షన్ చేసి భారతీయ సంస్కృతిని గొప్పగా చూపాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. కాగా దేవ్ స్వీయదర్శకత్వంలో నటించిన ‘మంకీ మ్యాన్’ రేపు విడుదల కానుంది. హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను తీర్చిదిద్దానని దేవ్ తెలిపారు.

Similar News

News April 7, 2026

దాడులు చేయబోతున్నాం, జాగ్రత్త.. ఇజ్రాయెల్ వార్నింగ్

image

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఆ దేశంలోని రైల్వే వ్యవస్థపై దాడులు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ రోజు రాత్రి 9 గంటల (ఇరాన్ కాలమానం ప్రకారం) వరకు ప్రజలెవరూ రైళ్లలో ప్రయాణించవద్దని, ట్రాక్స్ దగ్గర ఉండొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ ప్రాంతాల్లో ఉంటే ప్రాణాలు రిస్కులో పడతాయని స్పష్టం చేసింది. కాగా టెహ్రాన్‌తో పాటు IRGC కార్యాలయాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది.

News April 7, 2026

అల్లు అర్జున్- అట్లీ మూవీ నుంచి అప్డేట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ‘AA22xA6’ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. రేపు 11AMకి టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

News April 7, 2026

చిరంజీవి చొరవ చూపాలి: కేశినేని చిన్ని

image

AP: గత ప్రభుత్వం సినీ పరిశ్రమను హింసిస్తే తాము ఎంతో గౌరవిస్తున్నామని MP కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే నంది అవార్డులు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ‘అవసరమైనప్పుడు ఇండస్ట్రీతో చర్చిస్తాం. ఇందుకు చిరంజీవి చొరవ చూపాలి. టాలీవుడ్‌కు 65% ఆదాయం వచ్చే APలో కనీసం 25% షూటింగ్స్ జరిపితే బాగుంటుంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి’ అని పేర్కొన్నారు.