News April 29, 2024
ఒక్కసారి.. ఆలోచించండి, పరిశీలించండి!

Way2News పాపులారిటీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మా లోగోతో ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. వాటిని విశ్వసిస్తే ఇబ్బంది పడే ప్రమాదముంది. Way2News లోగోతో మీరు పొందే ఫార్వర్డ్ స్క్రీన్షాట్లను సులువుగా వెరిఫై చేయొచ్చు. మా ప్రతి వార్తకు యునిక్ కోడ్ ఉంటుంది. fc.way2news.comలో ఆ కోడ్ ఇస్తే సేమ్ ఆర్టికల్ చూపాలి. లేదంటే ఆ స్క్రీన్‌షాట్ ఫేక్. అలాంటి వాటిని grievance@way2news.comకు మెయిల్ చేయండి.
Similar News
News December 5, 2025
సూర్యాపేట: రూపాయి నాణేలతో నామినేషన్..!

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో యూత్ క్లబ్ సభ్యులు వినూత్నంగా మహిళా కూలీ బుడిగె పుల్లమ్మను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. బీసీ మహిళ రిజర్వేషన్ ఉన్న ఈ పదవికి ధరావత్ కోసం గ్రామంలో రెండు రోజులపాటు రూపాయి నాణేలు చందాలు వసూలు చేసి రూ.1,000 అందించారు. ప్రలోభాల రాజకీయానికి ముగింపు పలకాలని, గ్రామాభివృద్ధి కోసం పుల్లమ్మను బరిలో దింపినట్లు యూత్ సభ్యులు తెలిపారు.
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


