News May 4, 2024
పైకొకటి.. లోపల ఇంకోటి..
రాజకీయ పార్టీలు ఏ పక్షపాతం లేకుండా అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తున్నామని చెబుతుంటాయి. అయితే.. అదంతా పైకి మాత్రమేననే భావన చాలామందిలో ఉంటోంది. ఫలానా పార్టీ అని కాకుండా దాదాపు అన్ని పార్టీలు కులమతాలు, డబ్బు, పలుకుబడి ప్రాతిపదికనే టికెట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ విషయం ఆయా పార్టీల కార్యకర్తలకు సైతం తెలిసినా ఒప్పుకోరు. మీ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితే ఉందా? కామెంట్ చేయండి.
Similar News
News December 29, 2024
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్గా తెలుగు తేజం
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్పై ఆమె విజయం సాధించారు. 2019లోనూ ఆమె విజేతగా నిలిచారు. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజన్ తర్వాత ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్గా హంపి రికార్డులకెక్కారు. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ టైటిల్ గెలిచారు.
News December 29, 2024
సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు
TG: సంక్రాంతి పండుగకు 5వేల ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏయే రూట్లలో ఇవి నడుస్తాయి? ఛార్జీలు ఎలా ఉంటాయి? తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి.
News December 29, 2024
నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
TG: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం నిర్వహించనున్నారు. దీంతో మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.