News March 18, 2024
నేటి నుంచి ఒంటిపూట తరగతులు

నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News January 5, 2026
నెల్లూరు: ఒక్క రోజే 28 మంది వరకు అరెస్ట్.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోడి పందేలు, పేకాల స్థావరాలపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సైదాపురం మండల పరిధిలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, కావలిలో 5 మంది, ఉదయగిరిలో 6 మంది, రాపూరులో 7 మంది పోలీసులకు చిక్కారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.
News January 5, 2026
నెల్లూరులో ‘స్పై’ హీరో సందడి

హీరో నిఖిల్ నెల్లూరులో సందడి చేశారు. మాగుంట లేఔట్లోని ఓ షాపింగ్ మాల్ను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని చేపల పులుసు అంటే తనకు ఇష్టం అన్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
News January 5, 2026
నా విజయానికి కారణం చదువే : మంత్రి నారాయణ

మెరుగైన విద్య అందితేనే సమాజంలో గౌరవం, మంచి భవిష్యత్తు ఉంటాయని రాష్ట్ర మంత్రి పి. నారాయణ అన్నారు. నెల్లూరు కాపు భవన్లో బలిజ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు చదువే ఈ స్థాయిని ఇచ్చిందని వెల్లడించారు.


