News March 17, 2024
రేపటి నుంచి ఒంటి పూట బడులు: డీఈఓ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన తెలిపారు. ఉదయం 7.45గంటల నుంచి మధ్యాహ్నం 12.30గటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.
Similar News
News January 27, 2026
కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై కలెక్టర్ డీకే బాలాజీ సమీక్షించారు. నిర్మాణాల వేగవంతానికి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 121 గృహాలు మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గృహాలలో 719 గృహాలు BBL దశలో, 2770 గృహాలు BL దశలో, 119 గృహాలు RC దశలో ఉన్నాయన్నారు.
News January 27, 2026
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి. జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.
News January 27, 2026
మాతృ మరణాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు: కలెక్టర్

జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో వైద్యాధికారులతో సమావేశమై ప్రసూతి మరణాలపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించిన రెండు ప్రసూతి మరణాల కేసులను విచారించి, వారి మరణానికి గల కారణాలను వారికి చికిత్స చేసిన వైద్యులను, ఘటనా వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు.


