News May 4, 2024
ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు ఒక రోజు సెలవు
AP: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వేసేందుకు ఈసీ ఒకరోజు సాధారణ సెలవును మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఉద్యోగుల అభ్యర్థన మేరకు సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. సంబంధిత విభాగాల అధిపతులు, కలెక్టర్లు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 27, 2024
రేపు ఒకపూట సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
News December 27, 2024
‘మోదీ చెప్పినట్టే ICU బెడ్పై రూపాయి’
USD/INR 85.82 వద్ద ఆల్టైమ్ కనిష్ఠానికి చేరడంతో PM మోదీపై విమర్శలు వస్తున్నాయి. UPA హయాంలో రూపాయి విలువ పడిపోయినప్పుడు ఆయన చేసిన ట్వీట్లను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మోదీ చెప్పినట్టు రూపాయి నిజంగానే ICU బెడ్పై ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘మమ్మల్ని గెలిపిస్తే 100 రోజుల్లో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రూపాయి ICUలో చేరింద’ని 2013లో మోదీ ట్వీటారు.
News December 27, 2024
జియో యూజర్లకు బిగ్ షాక్
డైలీ డేటా అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని జియో తగ్గించింది. ఇప్పటివరకు ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసేవరకు ఈ వోచర్ వ్యాలిడిటీ ఉండేది. కానీ రూ.19తో రీఛార్జ్ చేస్తే వచ్చే 1జీబీ డేటాను ఒకరోజుకు, రూ.29 రీఛార్జ్ డేటా 2జీబీని రెండురోజులకు పరిమితం చేసింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం యూజర్లకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.