News March 6, 2025
ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉ.8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు జరుగుతాయి. అటు ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 15కు ముందే ఒంటిపూట బడులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 24, 2025
జమ్మూ టూరిజంపై ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జమ్మూ టూరిజాన్ని ఢిల్లీ బ్లాస్ట్ మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వింటర్ సీజన్ కావడంతో టూరిజం కార్యకలాపాలపై CM ఒమర్ అబ్దుల్లా సహా ట్రావెల్ ఏజెంట్లూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబుదాడితో టూరిస్టుల్లోనూ భయం నెలకొంది. పైగా దాడిలో కశ్మీర్ మూలాలున్న ఇద్దరిని NIA అరెస్టు చేసింది. ఇది మరోసారి జమ్మూ టూరిజంపై ఎఫెక్ట్ పడేలా చేసింది.
News November 24, 2025
AAIలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 20గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ (B.Com, BA, BSc, BBA), డిప్లొమా ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.12వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు NATS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: aai.aero.
News November 24, 2025
సాగులో కొత్త ట్రెండ్.. చక్ర వ్యవసాయంతో శివానీ సక్సెస్

ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చక్ర వ్యవసాయం(QUICK CYCLE FARMING) ట్రెండ్ నడుస్తోంది. ఈ విధానంలో తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను సాగు చేస్తారు. నిపుణుల సూచనలతో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎన్నుకొని, సరైన యాజమాన్యం, నీటి పారుదల కల్పించి తక్కువ సమయంలో అధిక ఆదాయం పొందుతున్నారు. ఉల్లిపాయలు, పాలకూర, మెంతులు, కొత్తిమీర మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. శివానీ కూడా ఇలాగే కొత్తిమీరతో లాభాలు పొందారు.


