News March 18, 2024
ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు

AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయి. నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగుతాయి. అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో ఏడు రోజుల పాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు.
Similar News
News April 7, 2026
చికెన్‌లో ఈ పార్టులు తినొద్దు!

చికెన్ మంచి ప్రొటీన్ ఫుడ్. అయితే ఇందులోని కొన్ని పార్టులు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు మాత్రమే ఉండే స్కిన్, బాక్టీరియా ఆవాసంగా ఉండే మెడ, తల, లంగ్స్, గిజార్డ్(కందనకాయ), కాళ్లు, తోక భాగాలను తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటివల్ల జీర్ణసంబంధ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్, వింగ్స్ మంచివని పేర్కొంటున్నారు.
#ShareIt
News April 7, 2026
IPL: ఢిల్లీకి షాక్.. మరో 3 మ్యాచ్‌లకు స్టార్క్ దూరం!

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరో 3 మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఆయన భుజం, మోచేయి సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా బోర్డు అనుమతిస్తే ఈ నెల 21న SRHతో మ్యాచ్ నాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపాయి. కాగా ఈ ఏడాది తొలి రెండు మ్యాచ్‌లను DC గెలిచిన విషయం తెలిసిందే.
News April 7, 2026
Alert: పాలిసెట్‌కు అప్లై చేసుకున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిసెట్-2026కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏపీలో ఈ నెల 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ 25న పరీక్ష జరగనుంది. సైట్: https://polycetap.ap.gov.in/. అటు తెలంగాణలో పాలిసెట్ అప్లికేషన్ గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. మే 13న ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్ష పూర్తైన 12 రోజులకు ఫలితాలు వెల్లడిస్తారు. polycet.sbtet.telangana.gov.in/


