News March 24, 2024
ఒకరోజు షూటింగ్‌కి రూ.కోటి

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ 4 రోజుల షూటింగ్‌కి ₹4 కోట్లు ఖర్చు చేసినట్లు మారుతి తెలిపారు. ‘ఒకప్పుడు ‘ఈ రోజుల్లో’ సినిమాని ₹30 లక్షల బడ్జెట్‌తోనే తీశా. కానీ రాజాసాబ్ మూవీకి 4 రోజుల్లోనే కోట్లు ఖర్చయింది. ప్రభాస్ సినిమా కాకపోతే ఆ బడ్జెట్లో నేను రెండు మూడు సినిమాలు తీసేవాడిని’ అని చెప్పారు. దీంతో రాజాసాబ్ సినిమా బడ్జెట్ ₹100 కోట్ల పైనే ఉంటుందని టాక్.
Similar News
News April 20, 2025
విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు: కేశినేని చిన్ని

AP: మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ మూలపాడులో జర్నలిస్టుల క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు జై షా అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
News April 20, 2025
రోహిత్ రికార్డును సమం చేసిన కోహ్లీ

ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న భారత ప్లేయర్‌గా రోహిత్ రికార్డును కోహ్లీ సమం చేశారు. ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో అర్ధసెంచరీతో అదరగొట్టిన కోహ్లీ 19వ POTM అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ(18 POTM) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా డివిలియర్స్(25) తొలి స్థానంలో ఉన్నారు.
News April 20, 2025
IPL: ముగిసిన సీఎస్కే బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే..

MIvsCSK మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. దూబే(50), జడేజా (53*) రాణించారు. ధోనీ 4 పరుగులకే ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా 2, చాహర్, అశ్వని, శాంట్నర్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై విజయ లక్ష్యం 177 రన్స్.