News October 10, 2024
ఒక్క ఓటమి.. కాంగ్రెస్‌పై మారిన ‘INDIA’ పార్టీల స్వరం

హరియాణాలో ఓటమి తర్వాత INDIA కూటమి పార్టీల స్వరం మారింది. విజయాన్ని ఓటమిగా మార్చే కళను కాంగ్రెస్ నుంచి నేర్చుకోవచ్చని శివసేన UBT సెటైర్ వేసింది. EVMతోనే గెలుస్తారు, ఓడితే నిందిస్తారని ఒవైసీ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘అహంకారం, అధికారం జన్మహక్కన్న ఫీలింగ్’ అని TMC పరోక్షంగా విమర్శించింది. SP కనీసం కాంగ్రెస్‌ను అడగకుండా UP బైపోల్స్ అభ్యర్థుల్ని ప్రకటించింది. అంతర్మథనం చేసుకోండని CPI సలహా ఇచ్చింది.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<