News April 5, 2025
ఒక డాలర్ =10.43L ఇరాన్ రియాల్స్

చరిత్రలోనే అత్యల్ప స్థాయికి ఇరాన్ కరెన్సీ పతనమైంది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 10.43 లక్షల రియాల్స్‌కు పడిపోయింది. 2015లో దీని విలువ డాలర్‌కు 32వేల రియాల్స్ ఉండేవి. అయితే అణ్వస్త్ర కార్యక్రమాలతో అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా గొడవల కారణంగా కరెన్సీ విలువ పతనమవుతూ వస్తోంది. దీంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కరెన్సీ మారక మార్కెట్లు మూతపడ్డాయి.
Similar News
News April 6, 2025
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కన్నుమూత

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గుండెపోటుకు గురై గత కొన్ని రోజులుగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కిమ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉన్నా తల్లి కోసం రద్దు చేసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్‌కు మొత్తం నలుగురు సంతానం.
News April 6, 2025
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రేపు SCలో పిటిషన్: స్టాలిన్

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. దీనిని సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజా పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ SCని ఆశ్రయించారు.
News April 6, 2025
జియో వినియోగదారులకు ఆఫర్ పొడిగింపు

IPL సందర్భంగా జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో హాట్‌స్టార్ యాక్సెస్‌ను ఫ్రీగా అందిస్తోంది. పలు రీఛార్జ్‌లపై గతంలో ప్రకటించిన ఈ ఆఫర్‌ను తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఆలోగా ₹100/₹195/₹949తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 90days యాప్ ఫ్రీగా చూడవచ్చు. ₹100 రీఛార్జ్‌కు 5GB డేటా, ₹195కి 15GB డేటా, ₹949తో రీఛార్జ్ చేసుకుంటే 84days వ్యాలిడిటీతో డైలీ 2GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా&కాల్స్ పొందవచ్చు.