News December 24, 2024

భారత్‌కు ఓ గుడ్‌న్యూస్.. మరో బ్యాడ్‌న్యూస్

image

ప్రాక్టీస్‌లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ కోలుకున్నారు. తాను మోకాలి గాయం నుంచి కోలుకొని 4వ టెస్టుకు రెడీగా ఉన్నట్లు రోహిత్ స్పష్టం చేశారు. అటు ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ కూడా గాయం నుంచి కోలుకొని ఫిట్‌గా ఉన్నట్లు ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. రోహిత్ కోలుకోవడం ఇండియాకు గుడ్‌న్యూస్ కాగా మనకు తలనొప్పిగా మారిన హెడ్ కూడా బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులోకి రావడం ఒక రకంగా బ్యాడ్‌న్యూసే.

Similar News

News December 25, 2024

విలన్ పాత్రకు రూ.200 కోట్ల రెమ్యునరేషన్?

image

కథానాయకులు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం తెలిసిందే. కానీ కన్నడ నటుడు యశ్ విలన్ పాత్రకు ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. రణ్‌బీర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారీ హిందీలో తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడి పాత్ర చేయడానికి గాను యశ్‌ భారీగా డిమాండ్ చేశారని సమాచారం. పాత్రకు ఆయనే కరెక్ట్ అని భావించిన మేకర్స్, ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

News December 25, 2024

₹10కే టీ, ₹20కి సమోసా.. అది కూడా విమానాశ్రయంలో

image

అధిక ధరల కారణంగా విమానాశ్రయంలో ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటిది ₹10కే టీ, వాట‌ర్ బాటిల్‌, ₹20కే కాఫీ, సమోసా లభించనున్నాయి. తక్కువ ధరలకే రీఫ్రెష్‌మెంట్స్ అందించే ‘ఉడాన్ యాత్రి కేఫే’ పైల‌ట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు మంగ‌ళ‌వారం కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో ప్రారంభించారు. ఆప్ ఎంపీ రాఘవ్ చ‌ద్దా ఈ అంశాన్ని పార్ల‌మెంటులో లేవ‌నెత్తగా, ప్ర‌భుత్వం కేఫే ఏర్పాటుకు ముందుకొచ్చింది.

News December 25, 2024

కుటుంబ సభ్యులతో YS జగన్(PHOTO)

image

AP: YS జగన్ కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని YSR ఎస్టేట్‌లో తన బంధువులు, కుటుంబ సభ్యులతో జగన్ సరదాగా ఓ ఫొటో దిగారు. ఇందులో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సోదరులు YS అనిల్, సునీల్, అవినాశ్ రెడ్డి, కుమార్తెలు వర్ష, హర్ష సహా తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి.