News July 7, 2024

ప్రతీ ముగ్గురిలో ఒకరికి బీపీ: WHO

image

ప్రపంచంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీతో బాధపడుతున్నట్లు తాజాగా జరిపిన సర్వేల్లో వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. ఇది బయటకు కనిపించకుండా గుండె, మెదడు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని పేర్కొంది. బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే స్మోకింగ్ మానేయడం, తినే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడం, నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలని సూచించింది.

Similar News

News November 2, 2025

జోగి రమేశ్ అనుచరుడిని వదిలేసిన పోలీసులు

image

AP: జోగి రమేశ్ <<18175158>>అనుచరుడు<<>> ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు వదిలిపెట్టారు. తిరిగి తాము పిలిచినప్పుడూ విచారణకు రావాలని ఆదేశించినట్లు రాము తెలిపారు. రమేశ్ సోదరుడు జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్తో తనకు, జోగి రమేశ్‌కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. జనార్దన్కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం రమేశ్‌కు లేదన్నారు.

News November 2, 2025

MECONలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

image

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<>MECON<<>>) 4 సీనియర్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.meconlimited.co.in/

News November 2, 2025

న్యూస్ రౌండప్

image

☛ ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్న CM చంద్రబాబు
☛ ఇవాళ 6PM నుంచి HYD యూసుఫ్‌గూడలో KTR రోడ్ షో
☛ WWC: ACA ఆధ్వర్యంలో VJA ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ LED స్క్రీన్ ఏర్పాటు
☛ 3 గంటలుగా VJA ఎక్సైజ్ ఆఫీసులోనే జోగి రమేశ్