News November 23, 2024

ఒకటి బీజేపీ.. మరొకటి కాంగ్రెస్

image

రెండు పార్లమెంటు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో BJP, కాంగ్రెస్ చెరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ 3,42,610 ఓట్ల మెజారిటీతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో BJP అభ్యర్థి డాక్టర్ శాంతుక్రావు మరోట్రావ్ హంబర్డే 12,283 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News November 23, 2024

మిలింద్ దేవరాపై ఆదిత్య ఠాక్రే గెలుపు

image

శివసేన(UBT) నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే గెలుపొందారు. మహారాష్ట్రలో అత్యంత ప్రాధాన్యమున్న వర్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆదిత్య.. శివసేన(శిండే) అభ్యర్థి మిలింద్ దేవరాపై గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి వీరిద్దరిలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మొత్తం 17 రౌండ్ల తర్వాత ఆదిత్య 8,801+ ఓట్లతో గెలుపొందారు. మన్మోహన్‌సింగ్ హయాంలో మిలింద్ కేంద్ర మంత్రిగా పని చేశారు.

News November 23, 2024

పార్లమెంట్‌లో మీ గొంతుకనవుతా: ప్రియాంక

image

వయనాడ్‌లో అఖండ విజయం అందించినందుకు ప్రియాంకా గాంధీ ఆ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయాను. నా గెలుపు మీ విజయమని భావిస్తున్నారు అని అనుకుంటున్నా. మీ ఆశలు, కలలను అర్థం చేసుకొని సాకారం చేసేందుకు మీరు ఎంచుకున్న వ్యక్తిగా మీ కోసం పోరాడతా. పార్లమెంట్‌లో మీ గొంతు వినిపించేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News November 23, 2024

బెంగాల్‌లో క్లీన్ స్వీప్ చేసిన టీఎంసీ

image

బెంగాల్‌లో 6 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార TMC క్లీన్‌స్వీప్ చేసింది. మదరిహత్, మేదినిపూర్, సితాయ్, హరోవా, నైహతి నియోజ‌క‌వ‌ర్గాల్లో TMC విజ‌యం సాధించింది. సితాయ్, హరోవాలో ఆ పార్టీ అభ్యర్థులకు 1.30 లక్షలు చొప్పున మెజారిటీ దక్కింది. తల్దంగ్రాలో లీడింగ్‌లో కొన‌సాగుతోంది. బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ 5 సీట్ల‌లో రెండో స్థానంలో, ఒకచోట మూడో స్థానంలో నిలిచింది.