News December 29, 2024
ఓటర్లు లక్ష మంది.. ఓటేసింది 2 వేల మందే
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడంలో చూపిన ఆసక్తిని, ఓటు వేయడంలో చూపలేదు విదేశాల్లో ఉన్న భారతీయులు. గత ఎన్నికల కోసం 1.20 లక్షల మంది ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో కేవలం 2,958 మంది మాత్రమే ఓటు వేయడానికి పోలింగ్ రోజు స్వదేశానికి రావడం గమనార్హం. కేరళ నుంచి అత్యధికంగా 89 వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడించాయి.
Similar News
News January 1, 2025
నేడు న్యూ ఇయర్ వేడుకల్లో కేటీఆర్
TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు నూతన సంవత్సర వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్లో నిర్వహించే సంబురాల్లో ఆయన భాగం కానున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ క్యాలెండర్ను కేటీఆర్ విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం పార్టీ నేతలతో కలిసి ముచ్చటిస్తారని, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని వెల్లడించాయి.
News January 1, 2025
ఇవాళ సెలవు
న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో ఇవాళ సెలవు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఇచ్చారు.. అటు ఏపీలో జనవరి 1న పబ్లిక్ హాలిడే లేదు. ఆప్షనల్ హాలిడే కావడంతో కొన్ని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. మిగతా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ యథావిధిగా పనిచేస్తాయి. ఇంతకీ ఇవాళ మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.
HAPPY NEW YEAR
News January 1, 2025
తెలుగు భాషను జగన్ భ్రష్టుపట్టించారు: మండలి బుద్ధప్రసాద్
AP: మాజీ సీఎం జగన్ తెలుగు భాషను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. ‘విజయవాడలో జరిగిన తెలుగు మహాసభలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అయినా సరే ఆయన వాటిని తెలుగుదేశం మహాసభలంటూ నోరుపారేసుకున్నారు. ఏమీ తెలుసుకోకుండా మాట్లాడటం జగన్కు అలవాటు. ఆయన హయాంలో తెలుగు భాషను నాశనం చేసేందుకు యత్నించారు’ అని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.