News September 7, 2024

వాళ్లిద్దరిలో ఒకరు INDకి ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అవుతారు: DK

image

ఫ్యూచర్‌లో టీమ్‌ఇండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ యువ ఆటగాళ్లలో ఇద్దరికే ఉందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్‌కు ఆ సత్తా ఉందని, ఇప్పటికే IPLతో పాటు INDకి కొన్ని మ్యాచుల్లో వారిద్దరూ కెప్టెన్లుగా చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్ కెప్టెన్‌గా ఉండగా, ODI, టెస్టుల్లో రోహిత్ శర్మ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 4, 2025

డెస్క్ వర్క్ చేసే వాళ్లకి ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు

image

నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య ఫ్రోజెన్ షోల్డర్. చేతిని పైకి ఎత్తినా, కాస్త వేగంగా కదిలించినా నొప్పి వస్తుంది. పడిపోవడం, దెబ్బ తగలడం లేదా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. డెస్క్‌లో కూర్చుని పనిచేసే వాళ్లకు ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు ఎక్కువని సర్వేలో తేలింది. డయాబెటిస్, హైపోథైరాయిడిజం, గుండె జబ్బుల బాధితులకు ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనిని అథెసివ్ క్యాప్సులైటిస్ అంటారు.

News December 4, 2025

ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!

image

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత <<18450358>>సమీప<<>> పాయింట్‌కు రావడం వల్ల ఇది ‘లార్జెస్ట్ మూన్’గా దర్శనమివ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.

News December 4, 2025

భారత్‌ చేరుకున్న రష్యా డిఫెన్స్ మినిస్టర్.. కాసేపట్లో పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపట్లో భారత్‌కు రానున్న నేపథ్యంలో ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్‌తో కలిసి ఆయన భారత్-రష్యా 23వ సమ్మిట్‌లో పాల్గొంటారు. భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌తో ఆండ్రీ భేటీ అవుతారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇరుదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. అటు పుతిన్ భారత్‌‌కు చేరుకున్నాక ప్రెసిడెంట్ ముర్ము ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.