News July 22, 2024
ప్రతి ఇద్దరు గ్రాడ్యుయేట్లలో ఒకరు ఉద్యోగానికి సెట్టవ్వరు!

యువతలో ఉద్యోగ నైపుణ్యాలు కొరవడుతున్నాయని ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. ప్రతి ఇద్దరు గ్రాడ్యుయేట్లలో ఒకరికే ఆధునిక ఆర్థిక వ్యవస్థకు తగిన ప్రతిభ ఉంటోందని పేర్కొంది. అయితే ఒకప్పటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగైంది. గత దశాబ్దంలో 66% మందికి తగిన స్కిల్స్ ఉండేవి కావు. ఇప్పుడది 49 శాతానికి పడిపోవడం గమనార్హం. ఏఐ వంటి టెక్నాలజీలు సవాళ్లు విసురుతున్న తరుణంలో యువత నైపుణ్యాలు అందిపుచ్చుకోవడం అత్యావశ్యకం.
Similar News
News November 28, 2025
స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News November 28, 2025
128 మంది మృతి.. కారణమిదే!

హాంగ్‌కాంగ్‌లోని అపార్ట్‌మెంటలో ఘోర <<18395020>>అగ్నిప్రమాదం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 128 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఆయా అపార్ట్మెంట్లలో ఫైర్ అలారాలు పనిచేయకపోవడంతో నివాసితులు మంటలను గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. 128మంది సజీవదహనానికి ఇదే కారణమని భావిస్తున్నారు.
News November 28, 2025
ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.


