News July 7, 2025

జీవితంలో సవాళ్లను స్వీకరించాలి: మంత్రి లోకేశ్

image

AP: 2019 ఎన్నికల్లో ఓటమి బాధ తనలో కసి పెంచిందని, ఫలితమే 2024 ఎన్నికల్లో మెజార్టీ అని మంత్రి లోకేశ్ చెప్పారు. జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో విద్యాశాఖను తీసుకున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరులో రూ.15 కోట్లతో అధునీకరించిన ప్రభుత్వ స్కూల్‌ను ఆయన సందర్శించారు. పేదరిక నిర్మూలనే P4 లక్ష్యమని మంత్రి చెప్పారు. అంతకుముందు స్కూళ్లోని తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.

Similar News

News July 7, 2025

దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలు నిలిపివేత

image

AP: ఈనెల 8-10 వరకు విజయవాడ దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తూ.గో, ప.గో, కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు, వ్యాపారులు అమ్మవారి అలంకరణకు 150టన్నుల కూరగాయలు, 50టన్నుల పండ్లు స్వచ్ఛందంగా అందజేశారు.

News July 7, 2025

రికార్డులు బద్దలుకొట్టిన ముల్డర్

image

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ క్వాడ్రాపుల్ సెంచరీకి అవకాశమున్నా 367* రన్స్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అయినా పలు రికార్డులు బద్దలుకొట్టారు. విదేశాల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో 350 రన్స్ చేసిన ఏడో ప్లేయర్‌గా నిలిచారు. ఒక టెస్టులో హయ్యెస్ట్ రన్స్ చేసిన సౌతాఫ్రికన్‌గా రికార్డు సొంతం చేసుకున్నారు.

News July 7, 2025

ఈనెల 11 నుంచి OTTలోకి కొత్త సినిమా

image

‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్, హనురెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘8 వసంతాలు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈనెల 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హేశామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.