News July 29, 2024

వన్‌సైడ్ లవ్.. అటు నుంచి స్పందన లేదు: సాయిదుర్గ తేజ్

image

తన పెళ్లంటూ వస్తున్న వదంతులపై సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్‌ స్పందించారు. ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘మీ లవ్‌ గురించి చెప్పండి’ అని యాంకర్‌ ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు. ‘వన్‌సైడ్‌ లవ్‌ ఉంది. అటు నుంచి స్పందన లేదు. ఎవరైనా అమ్మాయి నాకు నచ్చి మాట్లాడేలోపు.. మీకు పెళ్లి అయిపోయిందట కదా అనే ఆన్సర్ వస్తోంది’ అని నవ్వుతూ చెప్పారు.

Similar News

News January 4, 2026

కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ‘శ్రీరామ్మూర్తి’

image

కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు అందే శ్రీరామ్మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్మూర్తి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

HNK: 10 నుంచి టీటీసీ పరీక్షలు

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీటీసీ) వార్షిక పరీక్షలు ఈనెల 10 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్ గౌడ్ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.