News October 27, 2024

అనుకున్నదొకటి.. అవుతోందొకటి!

image

రోహిత్-గంభీర్ కాంబోపై భారీ అంచనాలుండేవి. దూకుడైన గంభీర్ కోచ్‌గా ఇంటెలిజెంట్ కెప్టెన్‌గా పేరున్న రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా తిరుగులేని శక్తిగా మారుతుందని అనుకున్నాం. కానీ వీరి కాంబినేషన్‌లో 27ఏళ్ల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్, సొంతగడ్డపై 12ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు టెస్ట్ సిరీస్ అప్పగించింది భారత జట్టు. NZ చేతిలో 36ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు ఓడింది. 1-5లో వీరికి మీ రేటింగ్ ఎంత?

Similar News

News October 27, 2024

‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఎప్పుడంటే?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి కానుకగా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయిందని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News October 27, 2024

ఆర్టీసీలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం: భట్టి

image

TG: ఈ ఏడాది మహిళలకు రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీలో డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలచే బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. త్వరలోనే వారు బస్సు యజమానులుగా మారతారన్నారు.

News October 27, 2024

దీపావళి లక్ష్మీపూజకు సమయమిదే?

image

శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చింది, అలాగే నరకాసురుడిని సత్యభామ చంపింది ఒకే రోజు. ఈ రోజునే దీపావళిగా జరుపుకుంటారని ప్రతీతి. అప్పటినుంచి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఈసారి అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 8.52 గంటల మధ్య లక్ష్మీపూజ సమయమని పండితులు చెబుతున్నారు.