News December 7, 2024
వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల కేసు.. అజిత్ పవార్‌కు ఊరట

MH Dy.CM అజిత్ పవార్‌కు ఊరట లభించింది. ₹వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల కేసులో IT ట్రిబ్యునల్ క్లీన్‌చిట్ ఇచ్చింది. MH సహకార బ్యాంకు స్కాం కేసులో జరందేశ్వర్ షుగర్ మిల్లును సీజ్ చేశారు. బ్యాంకులో బోర్డు సభ్యుడిగా అజిత్ ఉండగా మిల్లును తక్కువ ధరకే వేలం వేశారని, వేలంలో మిల్లు కొన్న సంస్థ నుంచి దాన్ని అజిత్ కుటుంబం దక్కించుకుందని ఆరోపణలున్నాయి. నిధుల మళ్లింపు ఆధారాలు లేవని ట్రిబ్యునల్ తేల్చింది.
Similar News
News October 27, 2025
తుఫాను తీరాన్ని తాకడం అంటే ఏంటి?

తుఫాను ఏర్పడినప్పుడు సముద్రంలోని సుడిగుండాల మధ్యలో ఉండే భాగాన్ని తుఫాను కన్ను (సైక్లోన్ ఐ) అంటారు. ఇది 50-60 కి.మీ పరిధిలో విస్తరించి ఖాళీగా ఉంటుంది. సైక్లోన్ ఐ తీరాన్ని (భూమిని) తాకితే <<18121128>>తుఫాను తీరాన్ని తాకిందని<<>> అర్థం. అది తీరాన్ని దాటే సమయంలో మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. వరదలు ముంచెత్తుతాయి. భీకర గాలులకు చెట్లు కూలిపోతాయి. సముద్రపు అలలు భూమిపైకి దూసుకొస్తాయి.
News October 27, 2025
తుఫాన్.. ఈ జిల్లాల్లో సెలవులు పొడిగింపు

AP: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరులో అధికారులు రేపు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడలో ఈ నెల 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. విశాఖ, కడప, ఏలూరు, ఉమ్మడి గోదావరిలో రేపు, కోనసీమ, కృష్ణా, NTR, గుంటూరు, అనకాపల్లి, విజయనగరం, మన్యం, అనకాపల్లి, బాపట్ల, అల్లూరిలో ఎల్లుండి వరకు హాలిడేస్ ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురంలో ఎలాంటి సెలవులు ఇవ్వలేదు.
News October 27, 2025
‘మనీవ్యూ’కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు

రుణాలిచ్చే మనీవ్యూ యాప్‌కు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. యాప్ సిస్టమ్‌లోకి చొరబడి 3గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు. 653 ఫేక్ అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకున్నారు. దుబాయ్, చైనా, హాంగ్‌కాంగ్, ఫిలిప్పీన్స్ నుంచి అంతర్జాతీయ ముఠా ఈ దాడి చేసిందని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. దుబాయ్‌లోని భారత సంతతి వ్యక్తి సూత్రధారి అని చెప్పింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, ₹10 కోట్లు ఫ్రీజ్ చేశారు.


