News March 18, 2024

ఒకసారే గ్రూప్-1 మూల్యాంకనం: APPSC

image

AP: గ్రూప్-1(2018) మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని APPSC ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ‘ఈ పరీక్షలను హైకోర్టు రద్దు చేయడంపై అప్పీల్‌కు వెళ్తాం. కమిషన్‌పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో, సరైన వివరణ ఇస్తాం. పరీక్షలు, నియామకాలు పారదర్శకంగా జరిగాయి. CCTV నిఘాలో జరిగిన మూల్యాంకనం ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఈ విషయంలో మాపై మచ్చ పడిందని అనుకోవడం లేదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News September 4, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది.

News September 4, 2025

బెస్ట్ లెక్చరర్స్‌కు అవార్డుల ప్రకటన

image

TG: యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో విశేష సేవలందించిన అధ్యాపకులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. OU నుంచి నలుగురు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ, అంబేడ్కర్ ఓపెన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ప్రొ.జయశంకర్ వర్సిటీల్లో ఒక్కొక్క లెక్చరర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీలో ఇద్దరిని బెస్ట్ లెక్చరర్స్‌గా ఎంపిక చేసింది. లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 4, 2025

సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయాలంటే?

image

ఈనెల 7న సంభవించే <<17544453>>సంపూర్ణ చంద్రగ్రహణం<<>> సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం ఆదివారం రాత్రి 9.56గంటలకు మొదలై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది. ‘గర్భిణులు దర్భలను(గరిక) తమ దగ్గర పెట్టుకోవాలి. నిద్రించే స్థలంలోనూ ఉంచుకోవాలి. గ్రహణానికి ముందు, తర్వాత తల స్నానం చేయాలి. సాయంత్రం 6లోపు ఆహారం తినాలి. ఆహార వస్తువులు, పూజ గదిలో దర్భలను వేయాలి’ అని సూచిస్తున్నారు.