News March 22, 2024
ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ

TG: రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డిలో వడగళ్లతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన.. ‘ప్రాథమిక అంచనా ప్రకారం 40వేల ఎకరాల్లో నష్టం జరిగింది. అధికారుల సర్వే పూర్తయ్యాక ఎకరానికి ₹10వేల పరిహారం అందిస్తాం. KCR చేసిన ₹8లక్షల కోట్ల అప్పులకు ₹60వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది’ అని విమర్శించారు.
Similar News
News April 20, 2025
అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <
వెబ్సైట్:https://agnipathvayu.cdac.in/
News April 20, 2025
హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్ సాయం కోరిన బంగ్లా

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
News April 20, 2025
ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.