News April 2, 2024
‘ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్’ రూల్ అమల్లోకి

‘ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్’ విధానం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ఒక ఫాస్టాగ్‌ను పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్‌లు వాడటాన్ని కుదరదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో వినయోగదారుల సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల అమలు గడువుని మార్చి 31 వరకు NAHI పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులున్నారు.
Similar News
News April 1, 2026
అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి

ఇరాన్ అన్నంత పని చేసింది. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్‌పై క్షిపణులతో దాడి చేసింది. దీంతో సర్వర్లు పనిచేయడం లేదని సమాచారం. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు చెందిన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 18 టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ <<19529158>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఇవన్నీ తమపై దాడులకు సహకరిస్తున్నాయని టెహ్రాన్ మండిపడుతోంది.
News April 1, 2026
ఢిల్లీ బౌలర్లు భళా.. లక్నో స్కోర్ ఎంతంటే?

IPL: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. మార్ష్ 35, పంత్ 7, మార్క్రమ్ 11, పూరన్ 8, అబ్దుల్ సమద్ 36, ముకుల్ 14, షహబాజ్ అహ్మద్ 15* రన్స్ చేశారు. నటరాజన్, ఎంగిడి చెరో 3 వికెట్లతో లక్నో బ్యాటర్లను బోల్తా కొట్టించారు.
News April 1, 2026
పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు

విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ఇండిగో సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి టికెట్ బుకింగ్స్‌పై ఇంధన ఛార్జీలను సవరించనున్నట్లు ప్రకటించింది. దూరాన్ని బట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ₹275-₹950, ఇంటర్నేషనల్ సర్వీసులలో ₹900-₹10,000 వరకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతాయని తెలిపింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు 25%, ఇంటర్నేషనల్ సర్వీసెస్‌పై 100% ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.


