News October 9, 2024
ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR

AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్‌లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.
Similar News
News December 11, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక రంగం, అమరావతికి నాబార్డు రుణం, పలు అభివృద్ధి పనులపై చర్చించనుంది. గవర్నర్ నివాసంగా కొత్తగా లోక్‌భవన్ నిర్మాణానికి టెండర్లు, జుడీషియల్ అకాడమీకి పరిపాలన అనుమతులు ఇవ్వనుంది. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
News December 11, 2025
దీక్షలో ఉన్నప్పుడు కాఫీ, టీ తీసుకోవచ్చా?

దీక్షలో ఉన్నప్పుడు కడుపు ఖాళీ ఉంటుంది. ఇదే సమయంలో టీ, కాఫీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణుల సలహా! దీనివల్ల గ్యాస్, గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఒకటి కన్నా ఎక్కువ కప్పులు తీసుకోకూడదని, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. శక్తిని కోల్పోకుండా ఉండేందుకు కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి పానీయాలు తీసుకోవడం ఉత్తమం’ అని చెబుతున్నారు.
News December 11, 2025
మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.


