News November 14, 2024

పాలనకు ఏడాది.. విజయోత్సవాలపై సీఎం సమీక్ష

image

TG: వచ్చే నెలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో విజయోత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ సభల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.

Similar News

News November 25, 2025

ఆ మెసేజ్‌లు నమ్మొద్దు.. బ్లాక్ చేయండి: రకుల్ ప్రీత్

image

తన పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దని హీరోయిన్ రకుల్ ప్రీత్ సూచించారు. 8111067586 నంబర్‌తో నకిలీ వాట్సాప్ ఖాతా ఉందని, వెంటనే బ్లాక్ చేయాలంటూ ఫ్యాన్స్‌ను కోరారు. తన ఫొటోను DPగా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి, కొందరు సందేశాలు పంపినట్లుగా గుర్తించినట్లు స్క్రీన్ షాట్స్‌ షేర్ చేశారు. గతంలోనూ అదితి రావు, రుక్మిణీ వసంత్ వంటి హీరోయిన్లకు ఇదే తరహా అనుభవం ఎదురైంది.

News November 25, 2025

తెలంగాణలో పెరుగుతున్న భూగర్భ జలమట్టం

image

TG: గత పదేళ్లుగా వర్షాకాలం తర్వాత కూడా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో పదేళ్లుగా భూగర్భ జలమట్టం పెరుగుతోందని TG జలవనరులశాఖ తెలిపింది. ఆసిఫాబాద్, నిర్మల్, KMR, NZB, ADB, పెద్దపల్లి, SDP, MDK, WGL, HNK, MHBD, SRPT, MBNR, NGKL, గద్వాల, NRPT,VKB, SRD, NLG, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మండలాల్లో జలమట్టం పెరిగింది.

News November 25, 2025

నవంబర్ నారీమణులదే

image

ఈ నెలలో భారత నారీమణులు ప్రపంచ వేదికలపై అదరగొట్టారు. ఈ నెల 2న భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలవగా, 23న అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. నిన్న ఉమెన్ ఇన్ బ్లూ కబడ్డీ వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు. ఈ విజయాలు క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు మరింత ఉపయోగపడుతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ నెలలో మహిళలు డామినేట్ చేశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.