News November 16, 2025

ONGCలో 2,623 అప్రెంటిస్‌ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/

Similar News

News November 16, 2025

ICDS అనంతపురంలో ఉద్యోగాలు

image

ఏపీ: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ వన్ స్టాప్ సెంటర్‌ 4 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/

News November 16, 2025

చీర కట్టినప్పుడు పొడవుగా కనిపించాలంటే..

image

కాస్త ఎత్తు తక్కువగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే చీర కట్టుకున్నప్పుడు పొడవుగా కనిపిస్తారు. మృదువైన సిల్కు ప్లెయిన్ చీర చిన్న అంచు ఉన్నది ఎంచుకోవాలి. పైట పొడవుగా ఉండి, చీర కింది అంచులు నేలకు తగిలేలా ఉండాలి. డీప్ నెక్ బ్లౌజ్‌కు ప్రాముఖ్యతనివ్వాలి. సింపుల్గా పొడవైన హారాలు బాగుంటాయి. పెద్ద పెద్ద బోర్డర్లున్న చీరలు, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోకూడదు. హైనెక్, క్లోజ్ నెక్‌కు దూరంగా ఉండాలి.

News November 16, 2025

ఆముదం పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

ఆముదం సాగు చేసే రైతులు నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెలల్లో తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కావున 12 నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడులను ఇవ్వాలి. అలాగే రబీ ఆముదం పంటలో మొలక కుళ్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ తెగులును పంటలో గుర్తించినట్లయితే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మెటలాక్సిల్ 2.5 గ్రాములను కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి.