News September 4, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. PPP మోడల్‌లో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ తయారీ, అమలుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

Similar News

News February 1, 2026

ఖమ్మం: ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్‌

image

జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో దళితబంధు, సోలార్‌ ప్లాంట్లు, పర్యాటక అభివృద్ధి, విద్యా సంస్థల భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.

నిర్మల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

image

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం నిలిపివేస్తామన్నారు. కోడ్ ముగిసిన వెంటనే యథావిధిగా తిరిగి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.