News January 9, 2025
కొనసాగుతున్న విచారణ.. ప్రశ్నల వర్షం!
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి KTRను విచారిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? క్యాబినెట్, ఆర్థికశాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? నిధులు బదిలీ చేయాలని బలవంతం చేశారా? అని ప్రశ్నలు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, ఏసీపీ, సీఐలు మాజీ మంత్రిని విచారిస్తున్నారు.
Similar News
News January 9, 2025
రేపు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వారికి పోలీసుల సూచనలు
TG: ‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో HYDలో ‘గేమ్ ఛేంజర్’ ప్రదర్శించే థియేటర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారు. రేపు ఆ సినిమా విడుదల సందర్భంగా నిబంధనలు పాటించాలని యజమానులను సూచించారు. థియేటర్ల వద్ద హడావుడి ఉండొద్దని, టికెట్ ఉన్న ప్రేక్షకులనే లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
News January 9, 2025
చర్చలు సఫలం.. యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆస్పత్రులకు ఏడాది కాలంలో ప్రభుత్వం రూ.1100 కోట్లు చెల్లించిందని, గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ.730 కోట్లనూ చెల్లించినట్లు ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 2013 నుంచి పెండింగ్లో ఉన్న ప్యాకేజీల రేట్లనూ 22శాతం పెంచామని గుర్తు చేసింది.
News January 9, 2025
26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన SCR
సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 26 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి-విశాఖ మధ్య ఈ నెల 11, 12, 13, 16, 17, 18 తేదీల్లో జన్సాధారణ్ రైలు(అన్నీ జనరల్ బోగీలు) నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖ-చర్లపల్లి మధ్య 10, 11, 12, 15, 16, 17 మధ్య కూడా ఇలాంటి రైళ్లే తిరగనున్నాయి. కేవలం స్టేషన్లో టికెట్ తీసుకుని ఈ రైళ్లు ఎక్కేయవచ్చు.