News September 16, 2024
కొనసాగుతున్న నందిగం సురేశ్ విచారణ.. 30 ప్రశ్నలు అడిగిన పోలీసులు!
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారిస్తున్నారు. లాయర్ సమక్షంలో నిన్న, ఇవాళ దాదాపు 30 ప్రశ్నలు అడగగా, కొన్ని ప్రశ్నలకు ఆయన తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. రెండో రోజు కస్టడీలో భాగంగా నేడు ఉ.8 నుంచి ఉ.9:30 వరకు విచారణ జరిగింది. ఉ.10:30 తర్వాత ఆయనను పోలీసులు మళ్లీ విచారించనున్నారు.
Similar News
News December 30, 2024
ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?
AP: సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
News December 30, 2024
పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
AP: రేషన్ బియ్యం మిస్సింగ్ ఆరోపణల కేసులో మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. జయసుధ పేరిట ఉన్న గౌడౌన్‌ను అద్దెకు ఇవ్వగా అక్కడున్న రేషన్ బియ్యం దారి మళ్లిందనే ఆరోపణలున్నాయి.
News December 30, 2024
సంక్షోభం.. పిల్లలు పుట్టడం లేదు!
సంతానం రేటు భారీగా తగ్గడం వియత్నాం దేశాన్ని కలవరపెడుతోంది. రికార్డు స్థాయిలో బర్త్ రేటు 1.91కి పడిపోయింది. ఈ ట్రెండ్ మరికొన్నేళ్ల పాటు కంటిన్యూ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బర్త్ రేటు తగ్గితే వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు శ్రామికుల కొరత సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం వియత్నాంలో 60 ఏళ్లకు పైబడ్డవారు 11.9% ఉండగా, ఇది 2050 నాటికి 25%కి మించనుంది. సంతానం రేటు పెరిగేందుకు ఆ దేశం ప్రణాళికలు రచిస్తోంది.