News May 3, 2024
కొనసాగుతున్న సస్పెన్స్.. పోటీకి ప్రియాంక విముఖత?

అమేథీ, రాయ్బరేలి స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. రెండు చోట్ల నుంచి రాహుల్, ప్రియాంకను పోటీ చేయాలని ఖర్గే సూచించినా.. తుది నిర్ణయాన్ని వారికే వదిలేశారు. మరో స్థానం నుంచి రాహుల్ పోటీకి సిద్ధంగా ఉన్నా.. ప్రియాంక మాత్రం పోటీకి సుముఖత వ్యక్తం చేయడంలేదని తెలుస్తోంది. మరి అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Similar News
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.


