News December 5, 2024

కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ బైఎలక్షన్ పోలింగ్

image

AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బైఎలక్షన్ పోలింగ్ కొనసాగుతోంది. యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరుగుతోంది. 116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సా.4 వరకు పోలింగ్‌కు అవకాశం ఉంది. ఐదుగురు అభ్యర్థులు నారాయణరావు, దీపక్ పులుగు, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి, బొర్రా గోపీమూర్తి పోటీలో ఉన్నారు.

Similar News

News November 19, 2025

సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

image

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.

ఇతిహాసాలు క్విజ్ – 70 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. ఆ వాయు దేవుడి పుత్రుడు కాబట్టే ఆంజనేయ స్వామిని మారుతి అని అంటారు. హనుమంతుడు వాయు శక్తి, వేగాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆకాశంలో పయనించేటప్పుడు, ఆయన వేగం, శక్తి వాయువుతో సమానం. అలా వాయు శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న దివ్య స్వరూపుడిగా ఆయన్ను మారుతిగా కీర్తిస్తారు. <<-se>>#Ithihasaluquiz<<>>