News November 13, 2024

RGVకి నోటీసులు ఇచ్చిన పోలీసులు

image

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీమ్ ఇవాళ HYDలోని ఆర్జీవీ ఇంటికి చేరుకుని నోటీసులు అందించారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది.

Similar News

News March 5, 2026

బిహార్ సీఎం రేసులో ఆ ఇద్దరు!

image

నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనుండటంతో బిహార్‌లో సీఎం పోస్ట్ ఖాళీ కానుంది. దీంతో ప్రస్తుత డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా చేసి పార్టీ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. దీంతో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ కసరత్తు చేస్తున్నారు.

News March 5, 2026

హోటల్‌లో మహిళకు పాక్ క్రికెటర్ వేధింపులు!

image

T20WCలో పేలవ ప్రదర్శనతో నిరాశలో ఉన్న PAK జట్టును ఓ వివాదం చుట్టుకుంది. SLతో జరిగిన సూపర్8 మ్యాచ్‌కు ముందు హోటల్ హౌస్ కీపింగ్‌ మహిళతో ఓ PAK ప్లేయర్ అనుచితంగా ప్రవర్తించగా ఆమె కేకలు వేసినట్లు NDTV పేర్కొంది. దీంతో హోటల్ సిబ్బంది ఆమెను రక్షించి జట్టు మేనేజర్ నవైద్‌కు ఫిర్యాదు చేయగా ఆయన ప్లేయర్ తరఫున సారీ చెప్పినట్లు వివరించింది. ఆ ప్లేయర్‌కు ఫైన్ వేసినట్లు త్వరలో PCB ముందు విచారణకు వెళ్తారని సమాచారం.

News March 5, 2026

ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్? సంచలన ఆరోపణలు!

image

US పొలిటికల్ లీడర్ల హత్యకు కుట్ర చేశాడన్న ఆరోపణలపై 2024లో అరెస్టయిన పాక్ వ్యక్తి ఆసిఫ్ మర్చంట్ బ్రూక్లిన్ సంచలన విషయం బయటపెట్టాడు. ట్రంప్, బైడెన్, నిక్కీ హేలీని చంపేందుకు Iran ఇంటెలిజెన్స్ తనను నియమించుకున్నట్లు తాజాగా కోర్టుకు తెలిపాడు. ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించడంతో వారికి సహకరించానన్నాడు. 2024 JUNEలో రిపబ్లికన్ లీడర్ హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానించి ఆసిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.