News October 5, 2024

ఆన్‌లైన్ బెట్టింగ్.. 2 కుటుంబాలు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్ కుటుంబాల్లో విషాదం నింపుతోంది. తెలంగాణలోని వడ్డేపల్లి(నిజామాబాద్)లో హరీశ్ అనే యువకుడు రూ.50 లక్షలకుపైగా కోల్పోయాడు. పేరెంట్స్ పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో ముగ్గురూ ఉరివేసుకున్నారు. ఏపీలోని గంగాధర నెల్లూరు(చిత్తూరు)లో దినేశ్ రూ.కోటి పోగొట్టుకున్నాడు. ఆ మొత్తాన్ని తీర్చలేక తల్లిదండ్రులు, అక్కతోపాటు పురుగుమందు తాగాడు. పేరెంట్స్ చనిపోగా, అక్క, సోదరుడు చికిత్స పొందుతున్నారు.

Similar News

News October 5, 2024

రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?

image

ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.

News October 5, 2024

TTDలో రివర్స్ టెండరింగ్ రద్దు

image

AP: TTDలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ EO శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను NDA ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ తదితర సంస్థలు అమలుచేస్తున్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.

News October 5, 2024

కంపెనీల వెబ్‌సైట్లకూ బ్లూటిక్.. త్వరలో గూగుల్ కొత్త ఫీచర్

image

ఫేక్ వెబ్‌సైట్లను సులభంగా గుర్తించడం, అందులోని సమాచారం ఆధారంగా యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా అకౌంట్ల మాదిరిగానే కంపెనీల వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చే ఫీచర్‌పై పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వెబ్‌సైట్ లింక్‌లకు బ్లూటిక్ ఇచ్చి పరీక్షించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.