News April 4, 2024

మరో 2 రోజులే ఛాన్స్

image

TG: EAPCETకు భారీగా <>దరఖాస్తులు<<>> వస్తున్నాయి. FEB 26న అప్లికేషన్ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటివరకు 3,21,604 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్ కోసం 2,33,517, అగ్రికల్చర్/ఫార్మా విభాగాల్లో 87,819, మూడు విభాగాలకు 268 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులకు ఇంకా 2 రోజుల గడువు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది మూడు విభాగాలకు కలిపి 3,20,683 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 24, 2025

ధర్మేంద్ర చివరి సినిమా ఇదే

image

బాలీవుడ్‌ దిగ్గజం ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరేతో సినీ ప్రవేశం చేశారు. 1960-80 మధ్య స్టార్‌డమ్‌ సంపాదించారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. షోలే, పూల్ ఔర్‌ పత్తర్, చుప్కే చుప్కే వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించారు. చివరిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియాలో సినిమాలో కనిపించారు. ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కీస్ విడుదల కావాల్సి ఉంది.

News November 24, 2025

స్మృతి పెళ్లి వాయిదా.. మరో బిగ్ ట్విస్ట్!

image

స్మృతి మంధాన పెళ్లి వేళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు పెళ్లి వేడుకకు సంబంధించి SMలో పోస్ట్ చేసిన ఫొటోలను స్మృతి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాలో ఆ ఫొటోలు, వీడియోలేమీ కనిపించడంలేదు. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఆమె అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. నిన్న వివాహం జరగడానికి ముందు ఆమె తండ్రికి గుండెపోటు రాగా తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అనారోగ్యానికి గురయ్యారు.

News November 24, 2025

19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి

image

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 19ఏళ్ల వయసులోనే 1954లో ఆయన ప్రకాశ్‌ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ వంటి ప్రసిద్ధ నటులతో పాటు విజేత, అజీత అనే కూతుళ్లు ఉన్నారు. అనంతరం 1980లో సహనటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. హేమ-ధర్మేంద్ర దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.