News March 22, 2024

6 చోట్ల మాత్రమే అభ్యర్థులు ఖరారు!

image

TG: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో BJP, BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. అయితే, ఇప్పటివరకు రిలీజ్ చేసిన జాబితాల ప్రకారం కేవలం ఆరు చోట్ల మాత్రమే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పెద్దపల్లి, జహీరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లో పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించాయి.

Similar News

News April 6, 2026

FLASH: పెరిగిన బంగారం, వెండి ధరలు

image

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) దిశగా సంకేతాలు రావడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ <<19578430>>ఉదయంతో<<>> పోలిస్తే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,530 పెరిగి రూ.1,50,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,400 వృద్ధితో రూ.1,38,100 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా కేజీకి రూ.5,000 ఎగబాకి రూ.2,60,000 పలుకుతోంది.

News April 6, 2026

బుల్ జోరు.. భారీ లాభాలతో మార్కెట్లు క్లోజ్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో 74,106కు చేరగా నిఫ్టీ 255 పాయింట్లు లాభపడి 22,968 వద్ద సెటిల్ అయింది. US-ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఆశలు, రూపాయి కోలుకోవడం, బ్యాంకింగ్ షేర్లలో భారీగా కొనుగోళ్లు, ఐటీ షేర్ల జోరు మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్ అత్యధికంగా 7.89% లాభాలు నమోదు చేసింది.

News April 6, 2026

ఇండస్ట్రీకి ఎక్కువ మంది అమ్మాయిలు రావాలి: సుప్రియ

image

సినీ పరిశ్రమకు ఎక్కువ మంది మహిళలు వస్తే అసమానతలు తొలగిపోతాయని డెకాయిట్ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ చెప్పుకొచ్చారు. తమ సినిమాకు ఎంతో మంది మహిళలు పనిచేశారన్నారు. తనకు సినీ నేపథ్యం ఉండటం అదృష్టంగా భావిస్తానని.. అది భరోసానిచ్చిందని చెప్పుకొచ్చారు. శేష్ గత సినిమాల కంటే ‘డెకాయిట్’ భిన్నమైనదని అన్నారు. కొవిడ్ తర్వాత ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందని, మంచి సినిమాలకు ఆదరణ దక్కుతోందన్నారు.