News October 30, 2024
నిర్మాణాత్మక విమర్శలనే స్వీకరిస్తాం: విజయ్

రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం(TVK) కీలక పోషిస్తుందని ఆ పార్టీ చీఫ్, నటుడు విజయ్ వెల్లడించారు. తాము నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం పొందేందుకు తీవ్రంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న ఆయన నిర్వహించిన తొలి మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News December 1, 2025
దిత్వా ఎఫెక్ట్.. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దిత్వా తుఫాన్ రావడంతో.. వరి పండిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫానుకు తమ పంట ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా మంది రైతులు వరి కోత సమయం రాకముందే కోసేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కోత యంత్రాల యజమానులు.. ఎకరా పంట కోయడానికి రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
News December 1, 2025
నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన TTE!

యూపీలో నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTEతో వివాదం తలెత్తగా లగేజ్తో పాటు ఆమెను బయటకు తోసేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయిందన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.
News December 1, 2025
పెళ్లి చేసుకున్న సమంత!

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వెల్లడించాయి. ఈ కపుల్కు పలువురు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించి ఈ జోడీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


