News May 24, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితేనే కాంగ్రెస్‌కు కనువిప్పు: హరీశ్

image

కాంగ్రెస్ నేతలు ఇంకెంత కాలం కేసీఆర్‌ను తిట్టుకుంటూ బతుకుతారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే నీళ్లు, కరెంట్ మాయమయ్యాయని ఆరోపించారు. ‘త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిస్తే తప్ప కాంగ్రెస్‌కు కనువిప్పు రాదు. ఆ పార్టీకి ఓటేయడమంటే వారి అబద్ధాలను ఆమోదించడమే. రాష్ట్రమంతా పంటలు ఎండిపోయాయి. క్రాప్ హాలిడే నెలకొంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News November 27, 2025

పెళ్లి చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్

image

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇవాళ జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు, ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్య రెడ్డి. ఇటు ఎన్నో పాపులర్ పాటలు పాడిన రాహుల్ ‘నాటు నాటు’ సాంగ్‌తో ఆస్కార్ స్థాయికి ఎదిగారు.

News November 27, 2025

ఈ కంపెనీల అధిపతులు మనవాళ్లే!

image

ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే అధిపతులుగా ఉన్నారు. అందులో కొందరు.. ఆల్ఫాబెట్ Google- సుందర్ పిచాయ్, Microsoft-సత్య నాదెళ్ల, Youtube-నీల్ మోహన్, Adobe -శంతను నారాయణ్, IBM-అరవింద్ కృష్ణ, Novartis -వసంత్ నరసింహన్, Micron Technology- సంజయ్ మెహ్రోత్రా, Cognizant- రవి కుమార్, వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్- రేష్మా కేవల్‌రమణి, Infosys-సలీల్ పరేఖ్, World Bank-అజయ్ బంగా.

News November 27, 2025

సొరకాయల కోత ఎప్పుడు చేపడితే మంచిది?

image

సొరకాయల పంట నాటిన 55-75 రోజులకు కోతకు వస్తుంది. లేత కాయలను గోటితో నొక్కినప్పుడు తొక్క లోపలికి గోరు సులభంగా పోతుంది. అలాగే లేత కాయల తొక్క మీద నూగు ఉంటుంది. కాయ లోపల గింజలు, గుజ్జు గట్టిపడక ముందే కాయలను కోసి మార్కెట్‌కు తరలించాలి. ముదిరిన కాయల తొక్క గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. కాయలను కోసేటప్పుడు తొడిమలతో సహా కోసి మార్కెట్‌కు తరలించాలి. కోసిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.