News July 9, 2024

చైనా ఆఫీసుల్లో ఐఫోన్లు మాత్రమే వాడాలి: మైక్రోసాఫ్ట్

image

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైనా, హాంకాంగ్‌లోని తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలిచ్చింది. వర్క్ ప్లేస్‌లో వారంతా సెప్టెంబర్ నుంచి కచ్చితంగా ఐఫోన్స్ మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్‌లు అందజేస్తోంది. చైనాలో గూగుల్ సేవలు లేకపోవడం, ఆ దేశ మొబైల్స్ వాడటం వల్ల కంపెనీ డేటాకు ముప్పు ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News January 19, 2025

WEIGHT LOSS: 145kgs నుంచి 75kgలకు!

image

అజర్ హాసన్ అనే యువకుడు నాలుగేళ్లలో 70 కేజీల బరువు తగ్గి ఫిట్‌నెస్ మోడల్‌గా మారాడు. ఇందులో 55KGS 7 నెలల్లోనే తగ్గినట్లు చెప్పారు. అతడి బాడీ ఫ్యాట్ 55% నుంచి 9%కి తగ్గింది. సరైన శిక్షణ, కఠోర శ్రమ, బ్యాలన్స్‌డ్ డైట్‌తో ఇది సాధ్యమైందన్నారు. తన తండ్రి మృతదేహాన్ని సమాధిలో పెట్టేటప్పుడు ఊబకాయం వల్ల కిందికి వంగలేకపోయానని, ఆ తర్వాత శ్రమించి బరువు తగ్గినట్లు MTV రోడీస్ షోలో అజర్ తెలిపారు.

News January 19, 2025

ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్, KCR, KTR

image

TGలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, KCR, KTR ఫొటోలతో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘట్‌కేసర్ గట్టు మైసమ్మ జాతర సందర్భంగా అభిమానులు దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో CBNకు బాస్ ఈజ్ బ్యాక్, పవన్‌కు ట్రెండ్ సెట్టర్, KCRకు గాడ్ ఆఫ్ TG కమింగ్ సూన్, KTRకు ఫ్యూచర్ ఆఫ్ TG అని క్యాప్షన్స్ పెట్టారు. సీనియర్ NTR, లోకేశ్, చిరంజీవి, హరీశ్ రావు ఫొటోలు కూడా ఆ బ్యానర్‌లో ఉండటం గమనార్హం.

News January 19, 2025

ఢిల్లీలో కాలుష్యం.. బ్యాడ్మింటన్ స్టార్ అసహనం!

image

ఇండియా ఓపెన్ టోర్నీలో పాల్గొన్న డెన్మార్క్ ప్లేయర్ బ్లిచ్‌ఫెల్ట్ ఢిల్లీలో పరిస్థితులు సరిగా లేవని అన్నారు. వాయు కాలుష్యం, పక్షుల రెట్టల మధ్య ప్రాక్టీస్ చేయలేకపోయానని చెప్పారు. వరుసగా రెండో ఏడాది అనారోగ్యానికి గురయ్యానని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన BAI టోర్నీ నిర్వహణకు ప్రత్యామ్నాయ వేదికలను చూస్తామని తెలిపింది. కాగా బ్లిచ్‌ఫెల్ట్ రెండో రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.