News October 17, 2024
ఇండియా నుంచి ఒకే ఒక్కడు!

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఇండియన్ యాక్టర్గా నిలిచారు. లండన్లోని ఫేషియల్ కాస్మొటిక్ సర్జన్ డా. జూలియన్ డి సిల్వా గోల్డెన్ రేషియో కాన్సెప్ట్తో ప్రపంచంలోని హ్యాండ్సమ్ నటుల జాబితాను రూపొందించారు. అందులో ఏకైక భారతీయ నటుడు షారూఖ్ ఖాన్(86.76%) పదవ స్థానంలో నిలిచారు. ఇంగ్లిష్ యాక్టర్ ఆరోన్ టేలర్ జాన్సన్ (93.04%)తో ప్రథమ స్థానంలో, లూసీన్ లావిస్కౌంట్ (92.41%) రెండో స్థానంలో ఉన్నారు.
Similar News
News January 12, 2026
18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు: CM

TG: తాను రెండేళ్ల పాలనలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెలవు తీసుకోవాలని ముందురోజు అనుకుంటా. కానీ ఏదో ఒక పని ఉంటుంది. సీఎం పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు బాధ్యతలు మరింత పెరిగాయి. రోజుకు 18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు. ఇది బరువుగా చూడట్లేదు. బాధ్యతగా చూస్తున్నా’ అని ఉద్యోగులతో సమావేశంలో పేర్కొన్నారు.
News January 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
News January 12, 2026
BANలో హిందూ సింగర్ మృతి.. జైలు అధికారులపై ఆరోపణలు

బంగ్లాదేశ్లో హిందూ సింగర్, అవామీ లీగ్ నేత ప్రోలోయ్ చాకీ(60) కన్నుమూశారు. 2024లో జరిగిన ఓ పేలుడు కేసులో ఆయన్ను గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కస్టడీలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి చనిపోయారు. అయితే చికిత్స అందించడంలో జైలు అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.


