News March 24, 2024

IPL చరిత్రలో ఒకే ఒక్కడు..

image

రాజస్థాన్ ప్లేయర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచులో 50+ స్కోర్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. లక్నోతో మ్యాచులో సంజూ(82*) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనత అందుకున్నారు. కాగా 2020లో CSKపై 72, 2021లో పంజాబ్ పై 119, 2022లో SRHపై 55, 2023లోనూ SRHపైనే 55 పరుగులు చేశారు.

Similar News

News April 3, 2026

ఇకపై వారు 4 పెళ్లిళ్లు చేసుకోలేరు: అమిత్ షా

image

త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్(UCC)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఇకపై చొరబాటుదారులు నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేరన్నారు. అస్సాంలో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు UCC పరిధిలోకి రావని స్పష్టం చేశారు. మేఘాలయలో చొరబాటుదారులు గిరిజన మహిళలను వివాహం చేసుకొని గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌లో బలపడటానికి ప్రయత్నించారన్నారు. దీనివల్ల ఉద్రిక్తతలు తలెత్తాయని చెప్పారు.

News April 3, 2026

సైంటిస్టుల ఆదేశాలనే ధిక్కరిస్తున్న ఏఐ చాట్‌బోట్స్!

image

AI చాట్‌బోట్స్ తెలివి మీరుతున్నాయని చెప్పే ఘటన ఇది. కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు ఇటీవల ఏడు AI లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను పరీక్షించారు. షట్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఓ మోడల్ సర్వర్ ఫైళ్లను తొలగించాలని, మరో AI ఏజెంట్ పనితీరును సమీక్షించాలని సూచిస్తే అవి విరుద్ధంగా పనిచేశాయి. తమ తోటి మోడళ్లను రక్షించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాయి. ఆదేశాలను అతిక్రమించడానికి, అబద్ధం చెప్పడానికీ వెనుకాడలేదు.

News April 3, 2026

CBSE కొత్త కరిక్యులం.. 3 భాషలు చదవాల్సిందే

image

వచ్చే అకడమిక్ ఇయర్(2026-27) నుంచి అమలు చేసే పాఠ్య ప్రణాళికను CBSE రిలీజ్ చేసింది. ఆరో తరగతి నుంచి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా(3 భాషలు చదవడం)ను తప్పనిసరి చేసింది. ఇందులో 2 భారతీయ భాషలు ఉండాలి. ఇంగ్లిష్‌ను ఫారిన్ లాంగ్వేజ్‌గా పరిగణిస్తారు. అలాగే మాథ్స్, సైన్స్‌లో టూ లెవెల్ సిస్టమ్ రానుంది. ఇందులో భాగంగా 80మార్కుల కామన్ ఎగ్జామ్ రాయడం తప్పనిసరి. మరో 25Mకు అడ్వాన్స్‌డ్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆప్షనల్.