News April 9, 2024
IPL చరిత్రలో ఒకే ఒక్కడు..

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించారు. టోర్నీ హిస్టరీలో 1000 పరుగులు చేసి, 100 వికెట్లు తీయడంతోపాటు 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా నిలిచారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకోవడం ద్వారా ఐపీఎల్లో క్యాచ్‌ల శతకం పూర్తి చేసుకున్నారు. అలాగే అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన CSK ప్లేయర్‌గానూ నిలిచారు.
Similar News
News January 31, 2026
నేను విన్నర్.. కింగ్ మేకర్‌ను కాదు: విజయ్

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. ‘నన్ను కింగ్ మేకర్ అనడం నాకు ఇష్టముండదు. కింగ్ మేకర్ అంటే మెయిన్ డ్రైవర్ కాదు.. సపోర్టర్. నేను గెలుస్తా. అలాంటప్పుడు కింగ్ మేకర్ ఎందుకవుతా? మా సభలకు వస్తున్న క్రౌడ్‌ను చూడట్లేదా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట తనను ఇప్పటికీ వెంటాడుతోందని చెప్పారు. తన సినిమాలకు అడ్డంకులు వస్తాయని ముందే ఊహించానన్నారు.
News January 31, 2026
ఎప్స్టీన్ ఫైల్స్.. 3M+ డాక్యుమెంట్లు విడుదల

అమెరికా లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు సంబంధించి మరో 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లను US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ <<18618902>>విడుదల<<>> చేసింది. ఇందులో 2వేల వీడియోలు, 1.8లక్షల ఫోటోలు ఉన్నాయి. ఎప్స్టీన్ ఆస్తులు, ప్రముఖులకు అతడు చేసిన మెయిల్స్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు సమాచారం. ఎప్స్టీన్ కేసులో ప్రముఖుల పేర్లు వినిపించడంతో ట్రాన్స్పరెన్సీ కోసం ట్రంప్ ఫైల్స్ విడుదలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
News January 31, 2026
జనవరి 31: చరిత్రలో ఈ రోజు

* 1666: మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరణం
* 1905: కవి, రచయిత కందుకూరి రామభద్రరావు జననం
* 1949: ప్రజా గాయకుడు గద్దర్ జననం
* 1972: మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ జననం
* 1975: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా జననం
* 1997: టీమ్ ఇండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ జననం
* 2009: హాస్యనటుడు నగేష్ మరణం


